విద్యాసంస్థల వాహనాలకు ఫిట్ నెస్ తప్పనిసరి

54చూసినవారు
విద్యాసంస్థల యాజమాన్యాలు తమ స్కూల్ వాహనాలకు ఫిట్ నెస్ తప్పనిసరిగా కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ అన్నారు. జగిత్యాలలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ టీంతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని 3 స్కూల్ బస్సులు, 7 ఇతర వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 464 స్కూల్ బస్సులు ఉన్నాయని ఇందులో 300 వరకు వాహనాలు ఫిటినెస్ కలిగి ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్