మహిళల సంబంధిత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో శనివారం జగిత్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన నెల వారి క్రైమ్ మీటింగ్ లో గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ రఘు చందర్ తదితరులు పాల్గొన్నారు.