మెట్ పల్లి: గల్ఫ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
మెట్ పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్ మూడు రోజుల క్రితం గల్ఫ్ దేశమైన బెహరాన్ లో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ తొందరలోనే మృతదేహాన్ని ఇక్కడికి తెప్పిస్తామన్నారు. ప్రభుత్వపరంగా సుధీర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు