కమలాపూర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ కార్యకర్తల ధర్నా

58చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి హరీష్ రావుల అరెస్టును ఖండిస్తూ గురువారం కమలాపూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు హుజరాబాద్ - పరకాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అన్యాయంగా కేసులు పెడతారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని వారిని స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్