ఎంపీడీవో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

319చూసినవారు
ఎంపీడీవో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
జయశంకర్ జిల్లా కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మహిళా ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మహిళా ఉద్యోగులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మ ఆటపాటలతో కోలాటాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సమ్మయ్య, ఎంపీడీవో శంకర్ నాయక్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్