వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

65చూసినవారు
వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని 700 సంవత్సరాల పురాతనమైన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యుల ఆధ్వర్యంలో 15 హోమ గుండాలు ఏర్పాటు చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు, హనుమాన్ మాలాధారులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన పాటలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్