అభ్యర్థులు నిర్ణీత సమయంలో హాజరు కావాలి

83చూసినవారు
అభ్యర్థులు నిర్ణీత సమయంలో హాజరు కావాలి
అంతర్గత ఈపి ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులు నిర్ణీత సమయంలో హాజరు కావాలనీ ఆర్జీ-3 ఏరియా జీఎం సుధాకరరావు ప్రకటనలో తెలిపారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీ రాణిరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ఈనెల 18 నుండి 20 వరకు జరిగే ఈపి ఆపరేటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 గంటల నుండి ప్రాక్టికల్ పరీక్షలుంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్