మహాత్మునికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

68చూసినవారు
మహాత్మునికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
మంథని: భారత జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా శనివారం రోజున మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ వర్థంతి పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఆయన మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారత దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పొందడానికి మహాత్మా గాంధీ చేసిన పోరాటాల ఫలితమే అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెగ్గెం రాజేష్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు కాచే శశిభూషన్, నాయకులు పెరవేన లింగయ్య యాదవ్,అజీమ్ ఖాన్, గోటికార్ కిషన్, మంథని సురేష్, మంత్రి నరేష్, దొరగొర్ల శ్రీనివాస్, అయేషా, అరిఫ్, ఎరుకల రమేష్, కొలిపాక శంకర్, అహేషన్, ఎరుకల సాగర్, పోరండ్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్