విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి: కలెక్టర్

73చూసినవారు
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్