మెట్ పల్లి న్యాయవాది భత్తుల దీక్షిత్ మరణం తీరనిలోటు
మెట్ పల్లి న్యాయవాదుల సంఘం సభ్యుడు బత్తుల దీక్షిత్ అకాల మరణం పట్ల బుధవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించి విధులను బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ, న్యాయవాది భత్తుల దీక్షిత్ మరణించడం చాలా బాధాకరమని, న్యాయవాదుల సంఘం పక్షాన దీక్షిత్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.