లాటరీ పద్ధతిన 466 మందికి "ఇళ్ల" కేటాయింపు

69చూసినవారు
లాటరీ పద్ధతిన 466 మందికి "ఇళ్ల" కేటాయింపు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో శనివారం పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు లాటరీ పద్ధతిన 466 మంది ఇండ్లను కేటాయించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీలు పాల్గొని లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, తహసిల్దార్ రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్