బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా సుల్తానాబాద్ పట్టణ వ్యాపార వాణిజ్య సంఘం నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక వారు మాట్లాడుతూ, బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం నిర్వహించే బంద్ కు విద్యా సంస్థలు, వ్యాపారులతో పాటు ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.