కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు

549చూసినవారు
కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు
పాలకుర్తి మండలం ఈశాల తక్కళ్ళపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున నెరువట్ల లక్ష్మి అనే వృద్ధురాలి పైన కోతుల దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ దాడిలో లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ఆవరణలో ఒంటరిగా కూర్చున్న లక్ష్మీని చూసి సుమారు 20 కోతులు ఒక్కసారిగా మీద పడి భయంకరంగా రక్కాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో లక్ష్మీని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్