రైతన్న కష్ట సుఖాల్లో ముందుంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలం సుద్దాల, రేగడి మద్దికుంట, అల్లిపూర్, రామునిపల్లి, కనుకుల, మంచరామి, తొగర్రాయి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు పాల్గొన్నారు.