పెద్దపల్లి టౌన్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ బస్టాండ్ ఫీడర్ లైన్ కింద ఉన్న చెట్టు కొమ్మలను తొలగించే నిమిత్తం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10. 30 గంటల వరకు శాంతినగర్, బస్టాండ్, హనుమాన్ నగర్, కొంతం వాడ, ఆదర్శ నగర్, తెనుగువాడ, ఈద్గా కాలనీ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.