పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన వడ్లకొండ నారాయణ గౌడ్ వృత్తిలో భాగంగా బుధవారం మధ్యాహ్నం తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తొంటి ఎముక విరగటం జరిగింది. గమనించిన తోటి గౌడ సభ్యులు మరియు రైతులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.