పెద్దపల్లి: నాగలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం

80చూసినవారు
పెద్దపల్లి: నాగలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం
పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో గల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అనుబంధ దత్తత అయిన శ్రీ స్వయంభు నాగలింగేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేములవాడ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ ఆదేశాల మేరకు ఆలయ ఆవరణలో జరిగిన కళ్యాణ వేడుకలను పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్