సుల్తానాబాద్: క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే

61చూసినవారు
సుల్తానాబాద్: క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో బాల శక్తి మెగా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతుల విద్యార్థులకు వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు, క్రీడాకారులు నైపుణ్యతపై దృష్టి పెట్టి రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్