శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన కాటం శ్రీనివాస్ విద్యుత్ షాక్ తో మరణించగా, రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా రూ. 5 లక్షల భీమా చెక్కును శుక్రవారం శ్రీనివాస్ సతీమణి రమాదేవికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.