పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కావాలి: జిల్లా కలెక్టర్

80చూసినవారు
పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కావాలి: జిల్లా కలెక్టర్
విద్యార్థులు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరుకావాలని, చిన్నతనం నుంచి మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సందర్శించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్