పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు

79చూసినవారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారు ప్రాంతంలో మంగళవారం రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 5030 నగదు, 6 మొబైల్‌లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు, తదుపరి విచారణ నిమిత్తం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

సంబంధిత పోస్ట్