ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వివిధ అంశాలపై టెండర్ నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారులు తెలిపారు. ఆలయంలోని టెంకాయలు, గుమ్మడికాయలు, కిరాణా షాపులు, వాహన పార్కింగ్ లైసెన్స్ హక్కు, కూల్ డ్రింక్స్, పూల దండలు, తల్లి ఆరాధన లైసెన్స్ హక్కు సహ పలు వాటికి ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు మంగళవారం సూచించారు. మండల నాయకులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.