మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం బిరుదు జయంతి సందర్బంగా సుల్తానాబాద్ లోని ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 55మంది మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిరుదు సతీమణి సుశీల, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.