సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఆలయ అభిృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి మూల విరాట్ కు వైభవంగా అభిషేక మహోత్సవం నిర్వహించారు. అర్చకులు సుంపటం కార్తీక్ ఆచార్యుల సారధ్యంలో అయ్యప్ప నామస్మరణ, అష్టోత్తర శతనామావళి, సంకీర్తనతోపాటు స్వామివారికి పంచామృత సహిత ఫలాభిషేకం, అలంకారం, పుష్పార్చన, మహా హారతి, మంత్ర పుష్పంగావించారు.