గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. శుక్రవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్యూనిటీ హాల్ లో శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సీఐలు ప్రసాదరావు, లింగమూర్తి, ఆర్జీ2 జీఎం సూర్యనారాయణ పాల్గొన్నారు.