కేరళ రాష్ట్రం వయనాడ్ ను వణికించిన విపత్తులో ఓ ప్రేమ కథ అందరినీ కదిలిస్తోంది. 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్న శ్రుతి, జాన్సన్ పెద్దల ఆమోదంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే అనుకోని వరదలు వీరి జీవితంలో విషాదం నింపాయి. శ్రుతి 9మంది కుటుంబీకులను కోల్పోయింది. దీంతో జాన్సన్ ఉద్యోగం వదిలి ఆమె కుటుంబ సభ్యుల మృతదేహాల వెలికితీత, అంత్యక్రియల వరకు ఆమె వెంటే ఉన్నాడు. ఈ నెలలో పెళ్లి చేసుకోవాలని భావించగా.. అనూహ్యంగా జాన్సన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.