సిరిసిల్ల జిల్లాలో ఉరేసుకొని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించడంతో 6నెలల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స అందించడంతో మెరుగు పడగా.. అదే విషయాన్ని విద్యార్థి మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉంటున్నాడు. కాగా శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.