డాక్టర్ పై దాడి చేసిన దుండగులు
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ మహేందర్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రి విధులు ముగించుకొని పెద్దపల్లిలోని తన నివాసానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో కారు ఆపి దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో డాక్టర్ తల, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.