చందుర్తి, మోత్కురావుపేట రోడ్ నిర్మాణం పూర్తి చేయాలి

55చూసినవారు
చందుర్తి, మోత్కురావుపేట రోడ్ నిర్మాణం పూర్తి చేయాలి
చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కురావుపేట వరకు ప్రగతిలో ఉన్న రోడ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం చందుర్తి మోత్కురావుపేట వరకు నిర్మిస్తున్న రోడ్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి విప్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్