దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద ప్రస్తుతం రూ.73,000 కోట్ల విలువైన 7 లక్షలకు పైగా అమ్ముడుపోని కార్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తెలిపింది. జూలై ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న వాహనాల నిల్వ వ్యవధి ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగిందని చెప్పింది. "అమ్మకాలు తగ్గడమే దీనికి కారణం, ఇది డీలర్ స్థిరత్వానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది" అని FADA అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు.