మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు మీడియాకు తెలిపారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కొందరు భక్తులు మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు వస్తామని చెప్పారు. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని అన్నారు. ప్రభుత్వానికి, ఆలయ, అధికారులకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.