ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సుబేదర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి పడి ఓ ప్రయాణికుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. రైల్వే పోలీస్ ఫోర్స్ కానిస్టేబుళ్ల అప్రమత్తత అతని ప్రాణాలను కాపాడింది. ఈ తతంగమంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.