రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు మూకుమ్మడిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శనివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ విప్, కేకే మహేందర్ లు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.