వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రజుపల్లి సత్య దైవార్చనాలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. భారతదేశం సర్వ మతాల సమ్మేళనమని అన్నారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.