పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులలోని పాఠ్యాంశాలపై విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలని ఉపాద్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అక్కపల్లిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా టీచర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. కట్టెల పొయ్యిపై ఆహార పదార్థాలను తయారు చేయవద్దని నిర్వాహకులకు సూచించారు.