భీమన్న గుడిలోకి వర్షపునీరు

77చూసినవారు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలోని ప్రాకారాల నుంచి నీరు ఆలయంలో పడుతుంది. దీంతో ఆలయం నీటిమయంగా దర్శనమిస్తుంది. గత సంవత్సరం కూడా ఇదే సమస్య ఉన్నా కూడా సంబంధిత అధికారులు పరిష్కారం చూపలేదని భక్తులు మండిపడుతున్నారు. ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపైనే ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్