రాజన్న సిరిసిల్లలో రూ. 4. 31 కోట్ల మద్యం తాగేశారు

81చూసినవారు
రాజన్న సిరిసిల్లలో రూ. 4. 31 కోట్ల మద్యం తాగేశారు
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న వైన్స్ లు, రెస్టారెంట్లు కిటకిటలాడాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్యం విక్రయాలు పెరిగాయి. 2024 డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు ఒక్క రోజే జిల్లాలో రూ. 4. 31 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లిక్కర్ 3, 723 బాక్స్ లు, బీర్లు 3, 852 బాక్స్ లు అమ్మకాలు జరిగాయి. 2023 డిసెంబరు 31న రూ. 1. 36 కోట్ల విలువైన మద్యం విక్రయాలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్