బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న భౌతిక దాడులను నిరసిస్తూ శాంతియుతంగా హిందూ ఐక్య వేదిక రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు మీడియాతో మాట్లాడుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ సంఘాలన్నీ ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నాయి.