రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో రమేష్ అనే యువకుడు రూ. 3లక్షల 30వేలతో రోటీ మెకర్స్ మిషన్ ను కొనుగోలు చేశాడు. గంటకు వేయి చపాతీలు తయారు చేస్తుందని రమేష్ చెప్పారు. కిలో పిండికి 25వరకు చపాతీలు తయారవుతున్నట్లు పేర్కొన్నారు. ఒక్క చపాతికి రూ. 8 అమ్ముతున్నట్లు చెప్పారు. అన్నిరకాల చపాతీలు, పూరీలు కూడా సిద్ధం చేస్తున్నట్లు రమేష్ అన్నారు. ఆర్డర్ ఇచ్చిన చేసి ఇస్తామని పేర్కొన్నారు.