తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియలో ఓ నాగుపాము వంట గదిలోకి ప్రవేశించింది. దానిని చూసిన కుటుంబీకులు భయంతో స్నేక్ క్యాచర్ పిలిపించారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించి.. ఎట్టకేలకు నాగుపాము తోకను పట్టుకుని బయటకు లాగాడు. అనంతరం దానిని ఓ పైప్‌లోకి పంపించాడు. ఆ తర్వాత పైప్‌లోకి ప్రవేశించిన నాగుపాము దాని గుండా ఆ సంచిలోకి వెళ్లింది. వెంటనే ఆ సంచిని తాడుతో కట్టేసి తీసుకెళ్లి అడవిలో సురక్షితంగా వదిలేశారు.