సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్.. కాసేపట్లో విచారణ

64చూసినవారు
సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్.. కాసేపట్లో విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కాగా సీబీఐకి విచారణకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కవిత ఇటీవలే సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. సీబీఐ తనను ప్రశ్నించడంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత పిటిషన్‌పై జవాబు చెప్పాల్సిందిగా సీబీఐకి స్పెషల్ కోర్టు నోటీసులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్