BRS MLC కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీహార్ జైలుకు వెళ్లక ముందు నిజామాబాద్ లోక్ సభ పరిధిలోనే రాజకీయ పర్యటనలు చేసిన ఆమె.. ఇప్పుడు ఇతర జిల్లాల్లో పర్యటలను చేయనున్నారు. జనవరి 6న అసిఫాబాద్ (D) జైనుర్ మండలంలో బైక్ ర్యాలీ చేస్తూ పర్యటించనున్నారు. మండలంలోని దేవుగూడ గ్రామంలో పలువురికి పరామర్శ, ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన, బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించనున్నారు. అనంతరం వాంఖిడి మండలంలో పర్యటించనున్నారు.