ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆర్ కుటుంబం: రేవంత్ రెడ్డి

74చూసినవారు
ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఆర్ కుటుంబం అప్పులపాలు చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చాలా కాలంగా సింగరేణి, విద్యుత్ శాఖలకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయిని అన్నారు. గత పదేళ్లలో దివాళా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్