కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు: CM రేవంత్

65చూసినవారు
కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు: CM రేవంత్
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మాజీ సీఎం కేసీఆర్ తమకు అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. 'కేసీఆర్ పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఏడాది పాలనపై సంతృప్తిగా ఉన్నా. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతినెలా రూ.6500 కోట్ల అసలు, వడ్డీ కడుతున్నాం. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదు. మేము అధికారంలోకి రాగానే వైట్ పేపర్ రిలీజ్ చేశాం' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్