TG: తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో నమోదైన రైల్‌రోకో కేసును కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్ గతంలో హైకోర్టును ఆశ్రయించగా.. మంగళవారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో రైల్‌రోకో జరిగిన స్థలంలో KCR లేరని న్యాయవాది తెలిపారు. KCR పిలుపు మేరకే రైల్‌రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను వాయిదా వేసింది.