ఇవాళ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పుట్టినరోజు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు జైలు బయట కేజ్రీవాల్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి కేజ్రీవాల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.