అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

74చూసినవారు
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
ములకలపల్లి మండలం జగన్నాథపురానికి చెందిన సాయిల శ్రీను(45) మద్యానికి బానిసై బాధ్యతలు పట్టకుండా తిరుగుతున్నాడు. మద్యం మత్తులో ఇంటికి రావడమే మానేశాడు. శుక్రవారం రాత్రి ఎక్కువగా మద్యం తాగి దమ్మపేట గ్రామ శివారులో ఖాళీ ప్రదేశంలో పడిపోయాడు. ఎవరూ చూడకపోవడంతో అక్కడే మృతి చెందాడు. తెల్లవారాక గ్రామస్థులు గుర్తించి అతడి భార్య వరలక్ష్మికి తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికిషోర్ రెడ్డి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్