చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మను ఉంచి సాంప్రదాయ పాటలు పాడారు. బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది బోధించారు.