జ్వరంతో యువకుడి మృతి

3254చూసినవారు
జ్వరంతో యువకుడి మృతి
చర్ల మండలం చినమిడసిలేరుకు చెందిన శ్యామల రవికుమార్(26) శనివారం జ్వరంతో మృతి చెందాడు. నాలుగు రోజుల నుంచి అస్వస్థతతో బాధపడుతున్న అతణ్ని సత్యనారాయణపురం పీహెచ్సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవికుమార్ ఈకార్ట్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. మండలంలోని లక్ష్మీకాలనీలోనూ డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్