భద్రాచలం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
భద్రాచలం పట్టణంలోని కొర్రాజుల గుట్ట ప్రాంతానికి చెందిన పి. రాము(48) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన రాముకు స్థానికంగా చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం శనివారం ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అతని భార్య రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.